Posts

Showing posts from January, 2024

Republic Day 2024

Image
  **జనవరి 26 గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే)-టి.ప్రభావతి దేవి-88 age (34 Articles)**     జనవరి 26 మనకు  స్వాతంత్య్రం పూర్తి వచ్చిన రోజు అన్నమాట. దీన్ని గణతంత్ర్య దినమని, రిపబ్లిక్ డే అని అంటాము. ఈరోజు మనము 74 సంవత్సరములు (2024) పూర్తిచేసుకుని 75వ గణతంత్ర్య  దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మీరు అనుకోవచ్చు మనకు 1947 ఆగస్టు 15 న స్వాతంత్రము వచ్చినది కదా! అని. కానీ బ్రిటిష్ వాళ్లు మనకు స్వతంత్రం ఇచ్చి మన దేశాన్ని వదిలి వెళ్లారు. రాజకీయంగా మన దేశం స్వతంత్రం అయ్యింది. రాజ్యాంగ చట్టాన్ని మనకు అనుగుణంగా రూపొందించుకోవాలి.  ఈ రాజ్యాంగ చట్టం డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందించబడింది. ఈ చట్టము రూపొందించడానికి దాదాపు రెండున్నర సంవత్సరములు పట్టింది. ఆ చట్టం 50 జనవరి26న  అమలైంది.  కనుక జనవరి 26న మనము ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనది ప్రపంచంలోనే పెద్దదైన ప్రజాప్రభుత్వ దేశం. అంటే ప్రజలే పాలకులు (ప్రభువులు). ప్రజలు ఓటు వేసి ప్రతినిధులను ఎన్నుకుంటారు. వారు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కొరకు