RAKHI


***రాఖీ***       (15) టిపిడి


          శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకొంటారు.  పండుగ ఆగస్టు నెలలో వస్తుంది.అయితే తెలుగు నెల,తిథి ప్రకారం శ్రావణ పౌర్ణమినాడు జరుపుకొంటారు.  పౌర్ణమి రోజు ఏనక్షత్రం ఉంటుందో నెలకు అదే పేరు వస్తుంది. ఆరోజు అన్నదమ్ములు,అక్క,చెల్లెల్ల పండుగ.  అంటే అక్క చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి క్షేమాన్ని ఆశ్రయాన్ని కోరుకొంటారు.  అంటే సోదరులు రక్షాబంధనం (రాఖీ) కడ్తారు.  సోదరులు కూడా సోదరీమణులకు కానుకలిస్తూ వారి శ్రేయస్సు, రక్షణకు ఆశ్వాసననిస్తారు. అయితే రాఖీ పండుగ ముందు రోజుల్లో ఉత్తర భారతంలో జరిపేవారు.   పోను,పోను అది దక్షిణాదికి ప్రాకింది.  కానీ శ్రావణ మాసంలోనే దక్షిణాదిన కూడా సోదరుల క్షేమం కోరుతూ శ్రావణ శుక్ల పంచమి రోజు గరుడ పంచమి వ్రతమును చేసి సోదరునికి  వాయనం యిస్తారు.  కొన్ని చోట్ల సోదరులు సోదరిమనులకు ఈమాసంలో పసుపు,కుంకుమ కింద చీర,సారెలు, డబ్బు పంపుతూ ఉంటారు                                                                                            

          ప్రస్తుతం సోదరి,సోదరీమణులు ఒకరికొక్కరు దూరంగా వున్నా రాఖీని,
కానుకలను పోస్టుద్వారా పంపి వెరీ క్షేమాన్ని కోరుతూ ఉంటారు.  ప్రస్తుతం వేరే వాళ్ళను కూడ అన్నదమ్ములుగా భావించి ఆడవాళ్ళు రాఖీని కడుతూ                                               
ఉంటారు.  సంప్రదాయం పూర్వం కూడ ఉండేదని అయితే భార్యకు భర్త,తల్లికి కొడుకులు రాఖీలు కట్టుకునేవారని చెప్తారు. చరిత్రలో రాణి మహామాయ రక్షణ కోరుతూ మొగలు చక్రవర్తికి రాఖీ పంపుతుంది. 

         ఈవిధంగా మన భారతీయ సంస్కృతి,సంప్రదాయాలు క్షేమంతో పాటు,ఇతరులకు క్షేమములను కూడ కోరుతుంటాయి.   ఈరోజు రాఖీలు రంగు రంగుల,రక రకాల డిజైనులలో తయారుచేసి అమ్ముతుంటారు.  పిల్లలు,పెద్దలు తమకు నచ్చినవి కొని పంపుతుంటారు.  అమ్మేవారు కూడ అందరు సుఖంగా ఉండి వ్యాపారాన్ని బాగా కొనసాగించాలని కాంక్షిస్తారు. 
                                                       ****
టి. ప్రభావతి దేవి (ప్రస్తుతం కడప),
రిటైర్డ్ హిందీ టీచర్,
అనంతపురము.
చరవాణి : 09642383659 (౦౯౬౪౨౩౮౩౬౫౯)
**FjSbut**
                                                                      

Popular posts from this blog

BINDU JEERA SODA JOB VACANCIES