AUGUST 15 2019
AUGUST 15,2019
***ఆగస్టు పదిహేను***
ఈ రోజు మనం డెబ్భై మూడవ (౨౦౧౯) (73 years,2019) స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్ర్యాన్ని పొందడానికి ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. గాంధీగారు స్వతంతోద్యమం రాకముందు ఎందరో విడి విడిగా వాళ్ళ ప్రాణాలను బలిచేశారు. అప్పుడు సరియైన నాయకుడు లేరు. కానీ గాంధీగారు జాతీయోద్యమంలో ప్రవేశించిన తరువాత ఆయన అందరిని ఒక్క తాటిమీద నడిపించి అహింస, సత్యాగ్రహము అనే ఆయుధాలతోనే ఆంగ్లేయులను మనదేశం నుండి తరిమేసి మనకు స్వాతంత్ర్యాన్ని లభింపచేసారు. ఈ విధముగా మన దేశము రాజకీయంగా స్వతంత్రమును పొందింది. కాని ఆర్థికంగానే కాక అనేక విషయాల్లో వెనుకబడి ఉంది. ప్రపంచంలోనే మనదేశము ప్రజాస్వామ్యదేశాల్లో పెద్దది. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అంటే మనదేశంలో రక రకాల మతాలు,కులాలు,వర్గాలు,జాతులు ఉన్నాయి. మనదేశం మతసామరస్యం కలిగినది కాబట్టే వివిధ మతాలు మనగలుగుతున్నాయి.
మతసామరస్యానికి,సౌభ్రాతృత్వాని కి కొని యాడుతు ఓ సందర్భంలో దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు జాంటీ రోడ్స్ ఇలా అన్నారు. భారతదేశం హిందూ దేశం. కానీ ప్రపంచంలో రెండు లక్షల మసీదులు ఉన్న ఏకైక దేశం భారతావనే. రంజాన్ మాసంలో ముంబైలోని మసీదుల్లో చోటు చాలకపోతే అక్కడి వినాయకుడి గుళ్ళల్లోనూ నమాజ్ చేసుకునేంత విశాల భావాలు కలిగిన వారు భారతీయులు. ఆదేశం మీది గౌరవంతో నేను నాకుమార్తెకు "ఇండియా" అని పేరు పెట్టుకున్నా అన్నారు.
మనదేశం ఆధ్యాత్మిక దేశం. ప్రస్తుతం భౌతిక వాదం ప్రభలినట్లు కనిపిస్తున్నా అంతరాల్లో మాత్రం ఆధ్యాత్మికతే ఉంది. ఇది మన ప్రాచీన సంప్రదాయం. మన ఋషులు మొదలగు పెద్దలంతా "సర్వేజనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవత్తు" అని మనకు నేర్పారు. అలా మనమంతా ఒక్కటే. ఏ కులమైనా,ఏ మతమైనా అందరం హిందూ దేశస్థులము. మన మాతృభూమి పురోగమనానికి మనమంతా కలిసి ఐకమత్యంతో కృషి చేయాలి. అందరి శ్రేయస్సును కోరి పాటుపడాలి. నాయకులకు పెద్దగా ఆస్తులుండేవి కావు. కానీ ఈనాడు ప్రజలను దోచుకోవటానికి అధికారాన్ని పొందడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలాంటి భావాల్ని విడనాడి దేశ క్షేమమే తమ క్షేమమని భావించి ప్రజాసేవ చేయాలి. అసలు దేశ నాయకులంటే ప్రజా సేవకులని అర్థం. నేడు అది మర్చిపోయి తమ అధికారాన్ని ప్రజలపై రుద్ది వాళ్ళను అధోగతి పాలు చేస్తున్నారు.
ఈనాటి బాలబాలికలే రేపటి పౌరులు. కనుక అందరు మన పెద్దల ఆదర్శాన్ని స్వీకరించి ఐకమత్యంతో తర,తమ భేదాలను విడనాడి ఐకమత్యంతో కృషి చేసి దేశాన్ని అభివృద్ధి మార్గంలోకి నడిపించాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉండి మన పూర్వీకుల మాటలను నిలబెట్టిన వాళ్ళ మౌతాము. అప్పుడే "సర్వేజనాః సుఖినో భవంతు" అనేది సత్యం అవుతుంది.
మన భారతీయ స్త్రీలు కూడ ఎంతో ముందంజవేసిన వాళ్ళే. పూర్వం రుద్రమదేవి,రెజియా,
నాగమ్మ మొదలైన నారీ మణులు అసామాన్య శూరులు. భారత స్త్రీ జగన్మాత రూపమని వివేకానందులవారు ప్రస్తుతించారు. విదేశాల్లో స్త్రీని భోగవస్తువుగా భావిస్తే,మనదేశంలో మాతృమూర్తిగా ఆరాధిస్తాం.
ఉదాహరణకు:- "గాంధీ" అనే ఆంగ్ల చిత్రంలో నటించిన వారందరూ ఆంగ్లేయులే. కానీ గాంధీ గారి సతీమణి కస్తూరిబాయి పాత్రలో నటించిన ఆమె మాత్రం భారతీయురాలు. ఈ విషయమై దర్శకుడిని ప్రశ్నించినపుడు, భారతీయ స్త్రీ ముఖంలోని హావభావాలు ఏవిదేశీ మహిళా చూపలేదు. అందుకే కస్తూరిబాయి పాత్రకు భారత స్త్రీనే ఎంపిక చేయాల్సివచ్చింది అని జవాబు ఇచ్చారు. పాశ్చాత్య పోకడలే ఆధునికత అనుకునే నేటి మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశం తన సంస్కృతి,ఆధ్యాత్మిక భావాలు,సౌభ్రాతుత్వం వీటివల్లనే ప్రపంచంలోని అన్ని దేశాలలో కంటే భారతదేశం ఎక్కువగా గౌరవింపబడుతోంది.
" మేరా భరత్ మహాన్ (నా దేశం చాలా గొప్ప దేశం)"
టి. ప్రభావతి దేవి (ప్రస్తుతం కడప),
రిటైర్డ్ హిందీ టీచర్,
అనంతపురము.
చరవాణి : 09642383659 (౦౯౬౪౨౩౮౩౬౫౯)
**FjSbut**