CHILDRENS DAY
నవంబర్ పద్నాలుగున 14(౧౪) మనం బాలల దినోత్సవంగా జరుపుకొనుచున్నాము. అసలు ఈ రోజు మన ప్రథమ ప్రధానమంత్రియైన జవహర్ లాల్ నెహ్రూగారి జయంతి (జన్మదినము) . ఆయనకు పిల్లలన్నా,పూలన్నా చాలా యిష్టము. అందుకే పిల్లలంతా ఆయనను "చాచా నెహ్రూ" అనే వారు. ఇక ఆయన కోటుకు ఎర్రగులాబీ ధరించేవారు. ఆయన గౌరవార్ధం మన మీరోజు యీ వేడుకను జరుపుకొంటున్నాము. ఈయన శాంతిని నెలకొల్పుటకై పంచశీల సిద్ధాంతాన్ని చేసి శాంతి దూతగా పేరు పొందారు.
నెహ్రూగారు 1889 (౧౮౮౯) వ సంవత్సరం నవంబర్ ౧౪వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ, వీరు ఒక కాలువ ఒడ్డున ఉన్న భవనంలో ఉండేవారు. కాలువను "నహర్" అంటారు. అదే క్రమంగా నెహ్రూగా మారి వీరి ఇంటి పేరైంది. ఇక తల్లిదండ్రులు యీయనను తమ ఇంటి ఆభరణం (జవహర్) గా తలచి జవహర్ అని నామకరణం (పేరు) చేసిరి. లాల్ అంటే బిడ్డ. అలా ఈయన పేరు జవహర్లాల్ నెహ్రూ అయ్యింది. ఈయన ఆగర్భ శ్రీమంతుల ఇంట జన్మించాడు. కానీ పేదల జీవితాలను చూచి ఈయన మనస్సు ద్రవించిపోయేది. వీరు విదేశములలో విద్యనభ్యసించి బారిస్టరై 1912 (౧౯౧౨) స్వదేశమునకు వచ్చారు. ఈయన తన తండ్రిగారైన మోతిలాల్ ను ,గాంధీ గార్ని,రవీంద్రనాథఠాకూర్ గార్ని తన గురుతుల్యులుగా భావించేవారు. గాంధీగారి ప్రభావం తో స్వాంతంత్ర్యోద్యమములో పాల్గొని అనేకసార్లు (దాదాపు తొమ్మిది సంవత్సరములు) జైలు జీవితాన్ని అనుభవించారు. గాంధీ గారి అడుగు జాడలలో నడుస్తూ ఆయన వారసుడనిపించుకొని మనకు ప్రధాన మంత్రి అయ్యారు.
PAGE…2
- 2 -
జవహర్ సతీమణి కమలానెహ్రూ. ఈమె కూడా జైలు జీవితం అనుభవించింది. కుమార్తె ఇందిరాప్రియదర్శిని ( ఇందిరాగాంధీ) సోదరి విజయలక్ష్మి పండిట్. ఈయన జైలులో ఉన్నప్పుడు "ఇందిరకు లేఖలు", "ప్రపంచదర్శనం" అనే పుస్తకములు వ్రాశారు.
అలహాబాదులో ఉన్న వీరి ఇంటిపేరు "ఆనంద భవన్" ఈ భవనాన్ని మోతీలాల్నెహ్రూ గారు కాంగ్రెస్ సంస్థకు శాశ్వతముగా దానము చేసెను. ఆ సంస్థకు కార్యదర్శిగా ఉండి జవహర్లాల్నెహ్రూ గారు దానికి స్వరాజ్య భవనమని పేరు పెట్టిరి. ఈవిధంగా ఈ కుటుంబంవారు అందరు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన వారే. గాంధీగారే నెహ్రూను తన వారసుడిగా తలంచి తానూ తప్పుకొని ఆయనను ప్రధానమంత్రిగా చేశారు. ఆయన ప్రజా ప్రభుత్వమునందున,విశ్వశాంతి యందును ఆయన ప్రదర్శించిన ఉన్నతాదర్శములు ప్రపంచ నాయకులలో కొద్దిమందికే కలవు. ఈయన 17 (౧౭) సంవత్సరములు మనకు ప్రధానమంత్రి గా ఉండి 1964 (౧౯౬౪) సంవత్సరము మే 27(౨౭)వ తేదీన స్వర్గస్తులైరి.
**జైహింద్**
తూములూరు ప్రభావతి దేవి,రిటైర్డ్ ప్రైవేట్ హిందీ టీచర్,అనంతపురము. మొబైల్ నెంబర్ :౯౬౪౨౩౮౩౬౫౯ (9642383659)