Subject: - Requesting to Government
Subject: - Requesting to Government
**నివేదన/అభ్యర్థన** (37) బాచి
ఈరోజు సమాజంలో ఆడపిల్లలపై,
చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు,
ఘోరాలు జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
అవి ముఖ్యంగా
: -
టెక్నాలజీ డెవలప్మెంట్ ద్వారా దేశం అభివృద్ధి కోరుకుంటూ ఉంది.
అందులో మంచి చెడు అనే
2 మిళితమై ఉన్నాయి.ఈ అంశంలో ప్రధానంగా సోషల్ మీడియా,
కొన్ని అనవసరపు వెబ్ సైట్లు మనుషులను ఉద్రేకపూరితంగా చేసేటటువంటి దుష్ట శక్తులు,చెడు అలవాట్లు దాదాపు మంచి కంటే చెడు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.
ఇందులో ప్రధానంగా టెక్నాలజీలో ఆ ట్యూబు,
ఈ ట్యూబు అని,
ఆటలని, పరిచయం లేని వ్యక్తులతో సరదాగా అని,ఇలా రకరకాలుగా కొన్ని సైట్లు సామాన్యుడు వాటిని చూచి వాటి చెడు ప్రభావం వల్ల కొన్ని అనర్ధాలకు దారితీస్తున్నాయి.
వీటిని ఆపడానికి ప్రభుత్వము తమ వంతు సెక్యూరిటీ సిస్టమ్స్ ను ఇవ్వవలసిందిగా
Cont…2
Page:2 (37) బాచి
అభిప్రాయపడుతున్నారు.
కొన్ని వెబ్ సైట్ ల వల్ల పసిపిల్లల నుండి ముసలివారి వరకు మంచి కంటే చెడు ప్రభావాన్ని ఎక్కువ చూపుతున్నాయి.
ఇందులో విద్యనభ్యసించిన,విద్యనుఅభ్యసించని
వారు కూడా ఏదో సంతోషం కోసం చూస్తూ,
వాటిలో లాగా చేసి మరొకరి కుటుంబాలలో బాధని చేకూరుస్తూ ఉన్నారు.
అది తెలిసి,
తెలియక చేసినా తప్పు తప్పే.
ఈ వెబ్సైట్ల వల్ల చాలామంది చిన్నారులు,
పెద్దలు దురలవాట్లకు అలవాటుపడి,
చెడు మార్గంలో అతి త్వరగా డబ్బు సంపాదించడానికి ఈ వెబ్సైట్లను వెతుక్కోవడం,
వాటికి బానిసలు కావడం జరుగుతోంది.
వీటివల్ల కొంతమంది చిన్నారులు కేవలం నాలుగవ తరగతి నుంచి మత్తు పానీయాలకు,
సిగరెట్లకు,గుట్కా లకు,
డ్రగ్స్కు మొదలగు అలవాట్లకు బానిసలై వారి ఆరోగ్యము పాడు చేసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇతర జీవితాల్లో నష్టాన్ని కలుగజేసి,
తమ కాలాన్ని తగ్గించుకొని నష్టపోవడం,
కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు దారి తీయడం జరుగుతోంది.
Cont…3
Page:3 (37) బాచి
చిత్రాల ద్వారా,
కొన్ని సీరియల్స్ ద్వారా,
కొన్ని బూతు వెబ్ సైట్లు ద్వారా
ప్రేరేపించబడి, విచక్షణ కోల్పోయి తప్పు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో భారతీయం సత్యవాణి గారు,
డి.ఎస్.పి సరిత గారు,
జె.డి లక్ష్మీనారాయణ గారు,
ఇలా ఎంతోమంది పెద్దవారు ఎన్నో జాగ్రత్తలు,
సూచనలు కొన్ని పెద్ద పెద్ద సంస్థల ద్వారా పిల్లలకు,
పెద్దలకు అవగాహన సదస్సులు ఇవ్వడం జరుగుతుంది.
కానీ వాటిని ఎంతమంది ఆచరిస్తున్నారు.
ఇందులో ప్రముఖంగా ప్రభుత్వాన్ని,
పోలీసు వ్యవస్థను,
ఇతర వ్యవస్థలను తప్పు పట్టే కంటే మనం కూడా మన కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడిస్తే బాగుంటుంది.
**ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయడం లేదు**
అన్ని రంగాలలో తప్పులు,వప్పులు ఉన్నాయి.
అత్యాచారాలు, ఘోరాలు జరగడానికి ముఖ్యంగా కారణం ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటివి,
చిత్రాలలో ఉన్నటువంటి,
అసభ్యకరమైనవి, వెర్రి,
వెకిలిచేష్టలతో,
క్రూరంగా, విచిత్ర వేషధారణలతో,అతి నీచాతి నీచంగా హావభావాలు,
Cont…4
Page:4 (37) బాచి
నటనలు వస్తున్న టీవీ కార్యక్రమాలు,
చెడు మార్గంలోకి తీసుకుని వెళ్లే కొన్ని కథలు,
వెబ్సైట్లోని కొన్ని వీడియోలు సమాజంలో మనిషిని ఒక నరరూప రాక్షసుడుగా మారుస్తున్నాయి,
మారుతున్నారు.
**కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు మంచి చేకూర్చడానికి భారతదేశంలో ఒక సెక్యూరిటీ సిస్టం ను, చట్టాలలో మార్పులను, కొంతమంది రికమండేషన్ లను కంట్రోల్ లోనికి తీసుకొని వస్తే బాగుంటుంది అని నివేదిస్తున్నాం/ అభ్యర్ధిస్తున్నాం**
ఇది నా ఒక్కడి అభిప్రాయము కాదు.
ఏడవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి చాలా ధైర్యంగా నేను మొబైల్లో బూతు తప్ప మరొకటి చూడను అని నిర్భయంగా,
ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు.
**తప్పు చేసినా శిక్ష పడదు, పడినా ఏదో ఒక విధంగా బయట పడగలను అనే దృఢమైన నమ్మకంను కట్టడి
(CONTROL) చేయగలిగితే అత్యాచారాలు, ఘోరాలు తగ్గుతాయని ఒక చిన్న ఆశ***
** జై హింద్** **Fjsbut**