రాఖీ (RAKHI)
**శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ఆగస్టు నెలలో వస్తుంది. అయితే తెలుగు నెల, తిధి ప్రకారం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకొంటారు. పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నెలకు అదే పేరు వస్తుంది. ఆరోజు అన్నదమ్ములు, అక్క,చెల్లెండ్ర పండుగ. అంటే అక్కచెల్లెలు, అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి క్షేమాన్ని, ఆశ్రయాన్ని కోరుకుంటారు. అంటే సోదరులు రక్షాబంధనం (రాఖీ) కడ్తారు. సోదరులు కూడా సోదరీమణులకు కానుకలు ఇస్తూ వారి శ్రేయస్సు, రక్షణకు ఆశ్వాసనానిస్తారు అయితే ఈ రాఖీ పండుగ ముందు రోజుల్లో ఉత్తర భారతంలో జరిపేవారు. పోను,పోను అది దక్షిణాదికి ప్రాకింది. కానీ శ్రావణమాసంలోనే దక్షిణాదిన కూడా సోదరుల క్షేమం కోరుతూ శ్రావణ శుక్ల పంచమి రోజు గరుడ పంచమి ఈ వ్రతమును చేసి ఆ సోదరునికి వాయనం ఇస్తారు. కొన్నిచోట్ల సోదరులు, సోదరీమణులకు ఈ మాసం లో పసుపు,కుంకుమ కింద చీర, సారెలు, డబ్బు పంపుతుంటారు.
ప్రస్తుతం సోదర, సోదరీమణులు ఒకరికొకరు దూరంగా ఉన్నా రాఖీని, కానుకలను పోస్టు ద్వారా పంపి వారి క్షేమాన్ని కోరుతూ ఉంటారు. ప్రస్తుతం వేరే వాళ్లను కూడా అన్నదమ్ములుగా భావించి ఆడవాళ్లు రాఖీని కడుతూ ఉంటారు. ఈ సంప్రదాయం పూర్వం కూడా ఉండేదని అయితే భార్యకు భర్త, తల్లికి కొడుకులు రాఖీలు కట్టే వారిని చెప్తారు. చరిత్రలో రాణి మహామాయ రక్షణ కోరుతూ మొగల్ చక్రవర్తికి రాఖీ పంపుతుంది.
ఈ విధంగా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు క్షేమం తో పాటు, ఇతరుల క్షేమం కూడా కోరుతూ ఉంటాయి.
ఈరోజు రాఖీలు రంగురంగుల, రకరకాల డిజైన్లతో తయారుచేసి అమ్ముతుంటారు. పిల్లలు, పెద్దలు తమకు నచ్చినవి కొని పంపుతుంటారు. అమ్మేవారు కూడా అందరు సుఖంగా ఉండి వ్యాపారాన్ని బాగా కొనసాగించాలని కాంక్షిస్తారు.**
**టి.ప్రభావతి దేవి, రిటైర్డ్ హిందీ టీచర్ (ప్రస్తుతము కడప), అనంతపురం. మొబైల్: 9642383659**