REPUBLIC DAY

**జనవరి 26 గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే)-టి.ప్రభావతి దేవి (34)**

    జనవరి 26 మనకు  స్వాతంత్య్రం పూర్తి వచ్చిన రోజు అన్నమాట. దీన్ని గణతంత్ర్య దినమని, రిపబ్లిక్ డే అని అంటాము. ఈరోజు మనము 70 సంవత్సరములు (2020) పూర్తిచేసుకుని 71వ గణతంత్ర్య  దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మీరు అనుకోవచ్చు మనకు 1947 ఆగస్టు 15 న స్వాతంత్రము వచ్చినది కదా! అని. కానీ బ్రిటిష్ వాళ్లు మనకు స్వతంత్రం ఇచ్చి మన దేశాన్ని వదిలి వెళ్లారు. రాజకీయంగా మన దేశం స్వతంత్రం అయ్యింది. రాజ్యాంగ చట్టాన్ని మనకు అనుగుణంగా రూపొందించుకోవాలి.  ఈ రాజ్యాంగ చట్టం డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందించబడింది. ఈ చట్టము రూపొందించడానికి దాదాపు రెండున్నర సంవత్సరములు పట్టింది. ఆ చట్టం 50 జనవరి26న  అమలైంది.  కనుక జనవరి 26న మనము ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము.
మనది ప్రపంచంలోనే పెద్దదైన ప్రజాప్రభుత్వ దేశం. అంటే ప్రజలే పాలకులు (ప్రభువులు). ప్రజలు ఓటు వేసి ప్రతినిధులను
ఎన్నుకుంటారు. వారు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కొరకు
                                                                         Cont….2
Page: 2   (34)
రాజ్యాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించి ప్రజలకు సుఖశాంతులను  కలిగిస్తారు.   
     రాజ్యాంగ చట్ట ప్రకారము మన ప్రజలందరికి పౌరహక్కులు, బాధ్యతలు ఏర్పడ్డాయి. దీని ప్రకారము మనకు వ్యక్తి స్వాతంత్ర్యం, మత స్వాతంత్ర్యము మొదలైన హక్కులు వచ్చాయి. స్వాతంత్రం రాకముందు స్త్రీలకు, విద్య లేని వారికి ఓటు హక్కు లేదు. కానీ పౌరహక్కుల ప్రకారము ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చింది. అయితే ఓటు వేయడానికి పురుషులకు 21 సంవత్సరములు, స్త్రీకి 18 సంవత్సరములు నిండి ఉండాలి. ప్రజలే యోగ్యులైన వారిని ఓటు ద్వారా ఎన్నుకొని ప్రజాప్రతినిధులుగా చేస్తారు. వారు దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తారు అంటే మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది.  కనుక ఓటు సరైన వారికి వెయ్యాలి.  ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఉంటాయి.
**నమస్తే**
టి.ప్రభావతి దేవి, రిటైర్డ్ హిందీ టీచర్,
అనంతపురం (ప్రస్తుతము కడప), చరవాణి: 9642383659

Comments

Popular posts from this blog