SUBHASH CHANDRA BOSE JAYANTHI
**సుభాష్ చంద్రబోస్ (నేతాజీ)** (38) TPD
సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరయోధులు లో అగ్రగణ్యుడు. దేశభక్తి పరాయణుడు. ఆయన 1897 జనవరి 23వ తేదీన కటక్ లో జన్మించారు. కలకత్తాలోని లావెన్ షా కళాశాలలో బి.ఎ చదువుతుండగా భారతీయులను ఎప్పుడూ కించపరుస్తూ ఓటెన్ అను ఆంగ్లేయ ప్రొఫెసరు మాట్లాడుతూ ఉండేవాడు. ఇది బోస్ కు నచ్చేది కాదు. అతడు దేశభక్తుడు పైగా ఉద్రిక్తత స్వభావం కలవాడు. అందువలన బోస్ ఆ ప్రొఫెసర్ పై తిరగబడ్డాడు.1920 వ సంవత్సరంలో సివిల్స్ రాసి, ఐపీఎస్ గా సెలెక్ట్ అయినప్పటికీ బ్రిటిష్ ఉద్యోగిగా ఉంటూ దేశ సేవ చేయలేనని ఐపీఎస్ కు రాజీనామా చేశాడు. దీనిని బట్టే ఆయన చిన్నప్పటినుంచి ఎంత దేశ భక్తి పరుడో గ్రహించవచ్చును. 1923లో చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన గల స్వరాజ్య పార్టీలో ఒక దళానికి అధిపతిగా చేరాడు.1931లో గాంధీ, ఇర్విన్ ఒడంబడిక జరిగింది. అదే సంవత్సరం ఇంగ్లాండులో రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ పాల్గొనడం బోస్ కు ఇష్టం లేదు. ఎందుకంటే గాంధీజీ అహింస ద్వారా స్వరాజ్యమును సంపాదించవలననెడి వాడు. కానీ బోస్ దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బలప్రయోగం ద్వారానే దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మిన వ్యక్తి. అందుచేత త్రిపురలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షోపన్యాసం చేస్తూ “మాతృదేశమైన భరత ఖండం నుంచి బ్రిటిష్ వారు ఒక సంవత్సర కాలంలో మన దేశాన్ని వదిలిపెట్టని యెడల వారు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది” అని హెచ్చరించిన ధీశాలి. దేశ స్వాతంత్ర సిద్ధి కొరకు మాతృదేశాన్ని వదిలి, విదేశాల్లో తన సాధన కొరకు కృషి సలిపాడు. 1941 జనవరి 26 కలకత్తాలో ఉన్న నేతాజీ అదృశ్యమైనట్లు ప్రకటించారు. అయితే నవంబర్ లో బెర్లిన్ నుండి ఆజాద్ హింద్ రేడియో ద్వారా దేశ ప్రజలకు సందేశం ఇచ్చే వరకు ఆయన జాడ ఎవ్వరికి తెలియదు. దేశ స్వాతంత్ర సిద్ధి కొరకు ఆయన “ఆజాద్ హింద్ ఫౌజ్" ను 1941లో కేవలం 15 మంది సభ్యులతో ఏర్పాటు చేసి 1942 కల్లా 3500 మంది యువ పౌరులతో ఫౌజ్గా రూపొందించి 1943 అక్టోబర్ 21న తాత్కాలిక భారత ప్రభుత్వ స్థాపన జరిగిన విషయాన్ని సింగపూర్ రేడియో ద్వారా ప్రకటించాడు.1943లో సింగపూర్ లో ఇండియన్ ఇండిపెండెన్స్ league, ఇండియా నేషనల్ ఆర్మీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాడు. ప్రవాస భారతీయుడు బోస్ ను అభిమానంతో 'నేతాజీ' అని పిలిచారు. అదే పేరుతో జీవించారు. ఆగస్టు 8న ఆయన వర్ధంతి.
** టి. ప్రభావతి దేవి, రిటైర్డ్ హిందీ టీచర్, అనంతపురం (ప్రస్తుతం కడప), 9642383659**