OCTOBER 2ND
ఈ రోజు అక్టోబర్ రెండవ తేదీ . ఈ రోజు గాంధీజీ పుట్టిన రోజు. గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో 1869 అక్టోబర్ రెండవ తేదీన జన్మిచారు. తండ్రి కరమ్ చంద్ గాంధీ. తల్లి పుతలీబాయి. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. మనదేశము బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండినది. మన దేశాన్ని ఆక్రమించి మనలను హీనంగా చూచేవారు,అది భరించలేక గాంధీ గారు మనదేశం నుండి వాళ్ళను వెళ్లగొట్టి మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించాలని పూనుకొన్నారు. అయితే ఆయన వారితో ఆయుధాలతో పోరాడలేదు. సత్యము,అహింస అనే వాటిని పాటించి స్వాతంత్ర్యాన్ని మనకు సంపాదించి పెట్టారు. ఈ స్వాతంత్ర్య సంగ్రామములో నెహ్రు,తిలక్,పటేల్,సరోజినీ నాయుడి లాంటి గొప్ప గొప్ప దేశనాయకులు ఈయన అడుగుజాడలలో నడిచి దేశ స్వాతంత్ర్యానికి పాటు పడ్డారు. బ్రిటిషువాళ్ళు ఉప్పుపైన గూడ సుంకం వేశారు. మన దేశం బీద దేశం. ఆ ఉప్పును కూడా కొనలేక పోయేవారు. అందుకాయన ఉప్పు సత్యాగ్రహం చేశారు. దానినే దండి యాత్ర అని అంటారు. మన దేశస్తులు బీదవారు కాబట్టి ముందు వాళ్లకు అన్నం పెట్టి ఏదైనా నేర్పాలి. ఆ బీదవాడికి అన్నమే భగవంతుడి స్వరూపం అనిపిస్తుంది. బీదవాడికి ఒంటినిండా కట్టుకొను గుడ్డ లేదు. అందువలన గాంధీ గారు కూడా చిన్నకొల్లాయి గుడ్డ కట్టుకునేవారు. ఆయన విదేశాల్లో చదువుకున్నారు. కానీ పేదవాండ్ల లాగానే ఆయన ఉండేవాడు. మనకు 1947 ఆగస్ట్ పదహైదవ తేదీ స్వాతంత్ర్యం వచ్చింది. ఆయనను అందరూ బాపూజీ అని అంటాము.అంటే తండ్రి అని అర్థం. విదేశాలలో కూడా గాంధీ గారి శిల్పాలు నెలకొల్పి ఉన్నారు.
***జై హింద్***
టి. ప్రభావతి దేవి (ప్రస్తుతం కడప),
రిటైర్డ్ హిందీ టీచర్,
అనంతపురము.
చరవాణి : 09642383659 (౦౯౬౪౨౩౮౩౬౫౯)
**FjSbut**