VIBRATIONS IN LIFE
ప్రకంపనలు (29) బాచి
ప్రకంపనలు (అలజడులు) రకాలు ఉంటాయి. భూ ప్రకంపనలు,మనుష్యులమధ్య,జీవితాల మధ్య వివిధ రకాలుగా ఉంటాయి.
అందులో జీవితాలలో వచ్చే ప్రకంపనలు ఎలా ఉంటాయి అంటే ఒక వ్యక్తి కానీ,మరొకరి సలహాల మీద (చెడు వారి) మీ జీవితంలో,మీ కుటుంబాలలో గొడవలు వచ్చి అవి మనిషి జీవితకాలం వరకు వెంటాడుతూ వారి పిల్లలపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మంచి నడవడికతో,మంచి వారి సావాసంతో నడుచుకోండి. మీ మూడు తరాల వారి గురించి చెడుగా చెప్పేవారిని దూరంగా ఉంచండి. అలా చెప్పేవారికి క్షమించే గుణం లేదని తెలుసుకోండి. ఈ జీవిత ప్రకంపనలు ఎప్పుడో మన పెద్దవారు,వంశంలోని వారు చేసిన తప్పులు ఇప్పటి తరం వారి కుటుంబ వారిపై రుద్ది వారి ఇతర తరలమీద చిరస్థాయిగా నిలిపే మహానుభావులున్న కాలం ఇది. ఒకరు చేసిన తప్పుకు ప్రకంపనలు ఎలా వస్తాయి అంటే నిశ్చలమైన నీటిలో ఒక నీటి బిందువు పడితే ఆ నిశ్చలమైన నీటిలో ,ఆ నీటి బిందువు చుట్టూ వలయకారాలు ఏర్పడిపోతాయి. అంతటి చలానాలు కలవి. ఒకరు తప్పు చేస్తే అది అందరికి సంక్రమిస్తుంది (సంక్రమింపచేస్తారు). మీరు మంచి చేసినా మన మనుషులు దేశ చరిత్రల కంటే,భారత,భాగవత,రామాయణాలు కంటే మన ఇంటి చరిత్రలు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మంచి కొంతవరకే చెపుతారు. చెడును చాలా విశాలమైన హృదయంతో అతి గొప్పగా వర్ణించి 100 సంవత్సరాల పూర్తి చేసుకునే ఎపిసోడ్స్ రూపంలో అందరికి ఆనందంగా చెపుతారు. డబ్బు సంపాదిస్తే మీకు గౌరవ మర్యాదలు,ఆస్తులు రావచ్చు. అది మీవద్ద,మీరు ఉన్నంతవరకే. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిది.కారు నడిపితే కాదు. మనిషి ఎప్పుడు ఒకే మంచి తనంతో ఉండాలని ఆశిస్తూ...
***ఇది ఎవరిని ఉందేశించి రాసినది కాదు అని గమనించగలరు** నమస్తే **