GOVERNMENT SCHOOLS - JOIN
**ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం** (8) **FJSBUT**
కడపలో-- విద్యారంగాన్ని కాపాడుకుందాం,ప్రభుత్వ స్కూల్ /కాలేజీలను బలోపేతం చేద్దాం అనే రౌండ్ టేబుల్ సమావేశంలో:--
చాలామంది పెద్దలు,ప్రముఖులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో తెలియపరచడం జరిగింది. మంచి నిర్ణయంతో ఈ సమావేశానికి శ్రీకారం చుట్టారు.
ఆ సమావేశం తరువాత నేను నా అభిప్రాయం, అనుభవాలు కలిపి రాసినది. (1) ముందుగా "గురుబ్రహ్మ, గురువిష్ణుః,గురుదేవో మహేశ్వరః,గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః అనేది ఈరోజు విద్యను నేర్చుకునే ఎంతమంది విద్యార్థులకు తెలపడం జరుగుతోంది.
(2)ఈ సమావేశంలో చాలా మంది పెద్దలు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు (లేదా) 10వ తరగతి వరకు తెలుగు మాత్రమే ఉండాలి అని తెలిపారు. చాలా సంతోషకరమైన విషయం.
(3) పాతకాలంలో గురువు అంటే తండ్రిలాంటి వాడని,ఒక గౌరవప్రదమైన వ్యక్తి అని గౌరవించేవారు. ఆనాడు విద్యార్ధి కొంత చదువు చదివినా ఈనాడు చాలా పెద్దస్థాయిలో ఉన్నా,చిన్నస్థాయిలో ఉన్నా ఈనాడు సమాజంలో ఏదో ఒక మంచి చేయాలని ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆనాడు ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని చాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్ద గలిగేవారు. వారికి ఈనాటి విద్యార్థిని,రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని ఆకాంక్ష ఉండేది. కాలం గడిచి పోయింది (స్కూల్ టైం) అనేటటువంటి భావన వారిలో ఉండేది కాదు.
(4) ఆనాడు ఒక ఉపాధ్యాయునికి చాలా తక్కువ జీతం లభించేది. కానీ ఈరోజు ఉన్న ఆర్ధిక పరిస్థితుల వల్ల వారి జీతాలు బాగానే ఉన్నాయి. పూట గడవని వారికంటే పర్లేదని నా అభిప్రాయం.
(5) ఆరోజులలో తెలుగు మీడియంలో ఒక ఉపాధ్యాయుడు 6 పిరియడ్లులో కనీసం 5 పిరియడ్స్ లో విద్యను భోదించేవారు.
(6) అసలు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా వచ్చాయి? దానికి మార్గము ఎవరు చెప్పారు? వారు ఎవరు? అని ఇందులో తెలియ పరచనవసరం లేదు. ఆ విషయము ప్రతి ఒక్కరి మనసాక్షికి తెలిసిందే.
(7) ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఒక ప్రైవేట్ విద్యా సంస్థను స్థాపించి దానికి ఒక పెట్టుబడిదారిని వెదికి, దాని మంచి చెడ్డలను స్వయంగా చూసుకొంటూ అభివృధ్ధి చేసి, ప్రైవేటు సంస్థలను అభివృద్ధి పరిచింది ఎవరు? ఆనాడే నా ప్రభుత్వ విద్యా సంస్థ గొప్పది అని చెప్పి ప్రైవేట్ సంస్థలకు అవకాశం ఇవ్వకుండా ఉండవలసింది. ఈవిధంగా దొరికిన అవకాశాన్ని చాలామంది పెట్టుబడిదారులు (విద్య రాక పోయినా) ప్రైవేట్ విద్యా సంస్థలు స్థాపించి,సంస్థ అధినేతగా చలామణి అవుతూ,రాజకీయ అండదండలతో డబ్బున్న ప్రతివాడు ప్రైవేట్ విద్యాసంస్థలు నడుపుతున్నారు.
(8) ఈ ఉపోద్ఘాతము అంతా పాతచింతకాయ పచ్చడని భావింప వద్దు. నేను కూడా ఒక ఉపాధ్యాయురాలు బిడ్డనే. నా అభిప్రాయాలలో తప్పులు పట్టకుండా వాస్తవికతతో ఆలోచించండి. ఈ ప్రపంచంలో, భూమిలో నాకు తెలిసి (1) మాతృమూర్తి (2) గురువు అంతకు మించి గొప్పవారు లేరు. తల్లిద్వారా పుట్టుక,గురువుద్వారా విద్య,నడవడిక,విధేయతలు తెలుసుకొనబడి ఆ మంచి నడవడికలతో ఉన్నత స్థానం పొంది దేశాభివృద్ధికి పాల్పడగలడు. ఆ ఇవన్నీ పాత విషయాలే అని విని విసిగిపోతున్నామని అనుకోవచ్చు. గతం అనేది కావాలి. ఇప్పుడు కాలంలో "పసుపు" ఆరోగ్యానికి మంచిది అని చెపితే ఎవ్వరూ వినరు. "సిక్స్త్ సెన్స్" సినిమా చివరిలో ఒక నీతి వాక్యం చెప్పినట్టు ఒక ప్రముఖ హీరో చెపితే పాటిస్తున్న రోజులివి.
(9) మన దేశంలో చాలా రకాల పార్టీలు,అధికార యంత్రాంగాలు, ప్రైవేట్ సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. ఒక ప్రైవేట్ సంస్థను ఒకరి అండద్వారా అభివృద్ధిచేసి అందులో వచ్చే రాబడిని రుచి చూచి చివరికి అధికార యంత్రాంగాన్ని, పార్టీలను చూచుకొని దేశాన్ని అభివృద్ధి చేయవలసిన భావి భారత పౌరులను,వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. దేశం అభివృద్ధి పధంలో వెళుతుందో,లేదో కానీ అథః పాతాళానికి వెలుతోంది అనిపిస్తుంది.
(10)ఈరోజు ప్రైవేట్ రంగంలో తప్పు జరిగితే ఎవ్వరైనా దానిని కేవలం వారం(7) రోజులలో మీడియా క్లిప్పింగ్స్ తో ప్రతి గంటకు ఒకసారి చూపి 4 రోజుల తరువాత మర్చిపోవచ్చు. ఏదైనా మంచి జరుగుతుందన్న ఆశ భూతద్దం పెట్టి వెతికినా దొరకదు.
క్షమించాలి - ఇవి కొంతమంది తెలిపిన విషయాలు : నేను ఒక సామాన్యుడిని, సార్ మీరు ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్నారు కదా? పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ పేరిట ఇబ్బంది పెట్టడమే కాక,వారి తల్లిదండ్రులను ఇబ్బంది పరుస్తున్నారు? దానివల్ల ప్రయోజనం ఏమిటి? అని అడిగితే ఆ ఉపాధ్యాయుడు చెప్పినది- మా స్కూల్ మేనేజ్మెంట్ తుమ్మమంటే,తుమ్మాలి.దగ్గమంటే దగ్గాలి అన్న దానికి చాలా బాధ కలిగించింది.
ప్రాజెక్ట్ వర్క్: ఏ స్కూల్ ఏ మతానికి చెందిందో ఆ మతానికి సంబంధించిన వ్యక్తి గురించి ప్రాజెక్ట్ వర్క్ (లేదా) ఇతర దేశాల ప్రముఖుల జీవిత చరిత్రలు చెపుతున్నారు. భారతదేశ సంస్కృతి,సాంప్రదాయాలు,చరిత్ర కారులు,కవులు ఇలా ఎన్నో ఉన్నా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా ఇంటర్నెట్లో వారి చరిత్రలు ప్రింట్ తీసి తరువాత పుస్తకంలో అతికించడమే ప్రాజెక్ట్ వర్క్. ప్రింట్ తీసినవి చదివారా అని పిల్లలను అడిగితే అంత టైం లేదు అంటున్నారు. ఇంత హీన స్థితిలో ఉన్నామా? అని అనిపించింది. అందుకే ఇంగ్లీష్ వాడు స్వాతంత్ర్యము మనకి ఇచ్చి వెళుతూ మతా లను కదిలించి, వారి సంస్కృతిని మరిచిపోకుండా మమ్మీ, డాడీ,గ్రాండ్ పా,ఆంటీ,అంకుల్ అని నేర్పించి వెళ్ళాడు. అమ్మ,నాన్న,అక్కా,అన్నా, తమ్ముడు, చెల్లి,నానమ్మ,అమ్మమ్మ,తాత,అవ్వ ఇలాంటివి ఎన్నో మరిచిపోయాం కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల. విద్యను అభ్యసించడమే ధ్యేయంగా ఈరోజు ప్రతి విద్యార్థి ప్రభుత్వ స్కూలుకు వెళ్ళాలి. ఒక ప్యాసింజర్ రైల్లో ప్రయాణించే అనుభూతి ప్రైవేట్ విద్యాసంస్థలలో రాదని గట్టిగా చెప్పవచ్చు. ఎవరి ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా, నా బిడ్డ రేపటి భావి భారత పౌరుడు కావాలని ఆకాంక్షతో..మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చి అక్కడ మంచి అనుభూతితో విద్యని అభ్యసించాలి. అంతే కాని గురువును ఏదో రూపంలో నిందించాలి,మార్కులు సరిగా వేయలేదని,మరో కారణం తల్లి తండ్రులు తో చెప్పి గురువులను అగౌరవపరుస్తూ,మీడియాను పిలిచి గురువుపై దాడి జరపడం చెయ్యద్దు. ఒకవేళ తప్పు ఉంటే క్షమించవద్దు. కానీ తప్పు మరోవైపు ఉన్నది కూడా ప్రశ్నించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలలో 15 కేజీల నుండి 20 కేజీల పుస్తకాలమోత,రోజూ ఒక ప్రాజెక్టు, ఇవన్నీ పిల్లలకు ఇంటిలోని అనుబంధాలు దూరం కావడం,వారి ఆట,పాటలు లేక పోవడం,స్వేచ్ఛ అన్నవి అసలు లేవు. తల్లిదండ్రులారా! ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు చెప్పబడును,అత్యుత్తమ స్థాయి ర్యాంకులలో మీ బిడ్డను చూసుకోండి అనే ప్రకటనలు చూసి మోసపోకండి. **ఈరోజే ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిద్దాం.** ఎవరో వస్తారని,ఏదో చేస్తారని మోసపోకుమా.. అనే పాట పాత వారికి తెలిసిందే. కానీ ఇది నిజం. ఇప్పుడు ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కాని, ప్రభుత్వము కాని చేస్తుందని అనుకోవడం భ్రమ. డబ్బు ఏ రూపాలలో అయినా (సన్మార్గం,దుర్మార్గం) కాని సంపాదించవచ్చు.
అసలైన విద్య,వినయ విధేయతలు ఎన్ని కోట్లు పెట్టినా సంపాదించలేరు.
**మన దేశ భవిష్యత్తు,మన బిడ్డల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.**
***Fjsbut***