Please


                             నేను గమనించిన కొన్ని విషయాలు: 
 ఒక పేదవాడు,తెలివిగల వాడు,మధ్య తరగతి వాడు,డబ్బు లేని వాడు ఏదో విధంగా ఒక మంచి విషయాన్ని తెలుసుకొని అదే విషయాన్ని చక్కగా డబ్బు,పరపతి లాంటివి ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి చిన్న వాడు చెపితే ఆ విషయం 99% వినరు. అదే హెచ్చు స్థాయిలోని వ్యక్తులు ఒక కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినా,పవర్ పాయింట్ ప్రెజంటేషన్ లో తెలిపినా,వీడియోలో సోషల్ మీడియా లో తిప్పినా ఎంత స్పందన తెలుపుతారో అర్థం కాదు. క్షమించాలి ఈ మధ్య ఒక చిన్న పేద పాప 3 నోట్ బుక్స్ సహాయంగాఅడిగింది. తక్కువ ధరలో. సరే అని నేను 10 పుస్తకాల షా పులలో ఆ నోట్ బుక్స్ అడిగాను (రూల్డ్ పేజెస్ బుక్ వెల:12 రూపాయలు). కానీ ఆ పుస్తకాలు 10 షాపులో లభించ లేదు. కారణం అందరూ ఎంత ధర ఉన్నా కొనడానికి రెడీగా ఉన్నారు. 12 రూపాయల పుస్తకములో రాసినా 100 రూపాయల పుస్తకంలో చిన్నారులు "పలక" అని రాసినా పలక అనేది కలప కాదు కదా? మన చిన్న పాటి ప్రవర్తన చిన్న పాటి వాడికి ఎంత ఇబ్బంది కరమో కదా? ప్లీస్... ఒక్కసారి ఆలోచిద్దాం. **Fjsbut**

Comments

Popular posts from this blog