10 EYES

కళ్ళు (10) బాచి



      కళ్ళు మనయొక్క శరీరంలోని వివిధ భాగాలవలె ప్రత్యేకమైనవి. మనకి రెండు చేతులు,కాళ్లు ఎంత ప్రధానమైనవో అదే విధంగా కళ్ళు రెండు ప్రధానం. కన్ను అనేది ఒక కెమెరా వంటిది. కంటితో చూచిన తరువాతే మెదడుకు సంకేతం వెళుతుంది.  ప్రపంచంలో మనం దేనినైనా చూడాలి,వర్ణించాలి అంటే కన్ను అనేది ముఖ్యం. కాని ఒక కన్ను ఉన్నా ఆకన్నుతో దేనిని చూచినా అది సంపూర్ణం కాదు. అది అసంపూర్ణమే.

      కళ్ళతో చూచిన ఒక చిత్రం,ప్రదేశం,దృశ్యం ఏది చూచినా అది మన కన్నుల ద్వారా ఒక ఫోటో రూపంలో మెదడులో నిక్షిప్తమవుతుంది. కన్నులద్వారా చూచి అది మెదడులో ఒక ఫోటో రూపంలో ఉండి ఎప్పుడైనా మన ఆలోచన,మనస్సుతో ఆ రూపం ఎదురుగా లేకపోయినా దానిని గుర్తు చేసుకొని ఆపాత అనుభూతిని మరలా పొందగలము.

        ప్రముఖ నటుడు "హాస్య బ్రహ్మ" అయినటువంటి బ్రహ్మానందం గారు చేస్తునటువంటి నటనలో వంద శాతం కంటియొక్క కదలికలతో,ముఖ కవళికలతో ప్రేక్షకులను ఆనంద పరుస్తున్నారు.

        "జ్ఞానేంద్రియానాం నయనం ప్రధానం" జ్ఞానేంద్రియాలలో కన్నుతో చూచి జ్ఞానాన్ని పొందుటకు కన్ను ప్రధానం అని అంటాము. ఇక్కడ కను చూపు అనేది ముఖ్యము.

        30 సంవత్సరముల క్రిందట ఒక మనిషికి ఒక కన్ను లేదు అంటే ఒక గాజు,పింగాణీ,ప్లాస్టిక్కుతో తయారు చేయబడిన కన్నును అమర్చుకునేవారు.
ప్రస్తుతం మనిషి రాకెట్లా దూసుకెళ్లే యుగంలో ఉన్నాడు. ఒక మనిషి తన తనువు చాలించిన తరువాత మరియొక మనిషికి "నేత్ర దానం" చేయటానికి ముందుకు వస్తున్నారు.

      ఒక వ్యక్తి జీవితంలో కొంతకాలము గడిపిన తరువాత (తాను చనిపోయిన తరువాత) తన కళ్ళను మరొక వ్యక్తికి నేత్రదానం చేసి కళ్ళు లేని వారికి  ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యాన్ని కలిగిస్తున్నారు.

      ఎన్ని కోట్లు గడించినా,ఎంత కీర్తిని సంపాదించినా అందులో పొందే అనుభూతి కంటే చనువు చాలించి కూడా "నేత్రదానం" చేయడం గొప్ప విషయం. కళ్ళను ఈజన్మలో దానం చేస్తే మరో జన్మలో మనకు కళ్ళు ఉండవు అనే "మూఢ నమ్మకాన్ని" వదిలి నేత్రదానం చేద్దాం. చేయించడానికి తోడ్పడి కళ్ళు లేని వారికి మరో క్రొత్త ప్రపంచాన్ని అందిద్దాం.

      మనిషి చేతులు,కాళ్లు, మాటలతో,నేర్పరితనంతో చేసే పనులు చాలా ఉన్నా, కళ్ళతో చూచి చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి. అందులోనుంచి వచ్చే భావాలే వేరు. కళ్ళు చేసే ప్రతి ఒక్కపని చాలా రకాలుగా ఉంటుంది. 
**కళ్ళు ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు**

*** సర్వేజనాః సుఖినోభవంతు ***

Comments

Popular posts from this blog