24 దాతలు దయచేసి చదవండి (Donors Please read)
దాతలు దయచేసి చదవండి (24) బాచి
మీరు ఎక్కడైనా,ఎప్పుడైనా ఆశ్రమంలో సేవా కార్యక్రమాల్లో దానం వస్తు రూపంలో కాని, ధన రూపంలో కాని సహాయాన్ని అందించే ముందు అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నవారిని విడిగా ఒకరిద్దరిని పలకరించండి. మీరు చేస్తున్న దానం 10 మందికి తెలపండి. సహాయం గుట్టుగా చేయాలి (గుప్త దానం) అనుకుంటే మీరు చేసిన సహాయం కూడా గుట్టుగానే (గుప్తంగానే) ఉంటుంది. కొన్ని సందర్భాలలో మొట్ట మొదటి సారిగా మీరు చేస్తున్న ఆశ్రమం సరియైనది కావచ్చు, కాక పోవచ్చు. మీరు పొరబాటు పడి చేయవచ్చు. మీరు సహాయం చేస్తున్న ఆశ్రయ నిర్వహణ అధికారి,మీతో వచ్చిన తోటి మిత్రులు,ఆ ఆశ్రమంలో పొందుతున్న వారందరితో కలిపి ఫోటోలు తీయండి. మీరు డబ్బు రూపేణ సహాయం చేస్తే రశీదు తీసుకొంటూ అది రిజిస్టర్డ్ సంస్థనా? కాదా? అని గమనించండి. మీరు సహాయం చేసే ముందు ఆశ్రమం గురించి,దానిని నిర్వహిస్తున్న వారి గురించి మీ మిత్రులతో తెలుసుకోండి.
మీరు ముందుగా ఎక్కడ సహాయం చేస్తున్నారో పబ్లిక్ (స్నేహితులు,పరిచయస్తులు)లో తెలపండి. వారి ద్వారా కొన్ని విషయాలు,అభిప్రాయాలు బయటికి రావచ్చు,రాకపోవచ్చు.
మీరు చేసిన,మీ ద్వారా చేయబడిన సహాయ కార్యక్రమం ఫోటోలు తీసిన తరువాత వాటిని ప్రింట్ మీడియాకు ఇవ్వండి లేదా సోషల్ నెట్ వర్క్ ద్వారా బంధువులకు,స్నేహితులకు,బయటి ప్రపంచానికి తెలిసే విధంగా పోస్ట్ చేయండి.
ఇలా చేయడం వలన క్రింది విషయాలు తెలియవచ్చు. కొన్ని సమయాల్లో నిజాలు తెలుస్తాయి. వాటి వల్ల మంచి కూడా జరగ వచ్చు.
అవి:-
**ఆశ్రయ వాసులు ఆశ్రమం పొందుతున్నారా?**
**అక్కడ ఏదైనా ఇబ్బంది పడుతున్నారా?**
**ఫోటోల వల్ల ఆశ్రమం లో వారు భిక్షాటనకు వస్తే తెలుస్తుంది. ఇంటిలో చెప్పకుండా వచ్చిన వారి ఆచూకీ,తప్పిపోయి ఆశ్రమం చేరినవారు వివరం తెలుస్తుంది**
**ఒక ఆశ్రమంలో ఉన్నవారు ఇంకొక ఆశ్రమంలోనికి ఎందుకు మారుతున్నారు తెలుస్తుంది**
**మరో విధంగా ఇతర రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చారా? ఏ పరిస్థితులలో వచ్చారో కూడా ఆశ్రయ నిర్వాహణాధికారికి తెలియక పోవచ్చు. అతనికి వారు ఎక్కడ నుండి లభించారు (మతి స్థిమితం లేకుండా ఉన్నవారా?) తెలుసుకోండి**
మీరు అన్నదానం చెయ్యాలనుకున్నారా? అయితే వారి భోజనాల సమయానికి మీరు,మీ మిత్రులు కలిసి వెళ్లి మీరే స్వయంగా వడ్డించి రావాలి.
మీరు బెడ్స్,దుప్పట్లు, టేబుల్స్ లాంటివి అందజేసినప్పుడు మధ్యలో వెళ్లి గమనించి రండి. మీరు వస్త్ర దానం చేసేముందు ఆవిషయం ఆశ్రమం వారికి తెలపద్దు. ఫ్రూట్స్ పంచాలి అని చెప్పండి (క్షమించాలి: అలా ఎందుకు చెప్పాలో కారణం నేను తెలపటం లేదు).
ఆశ్రయ నిర్వాహకుడు సహాయం చేస్తున్న వారి వివరములు,సహాయం ఎందుకు చేస్తున్నారు (ఏ సందర్భంగా...) అనే విషయం ఆశ్రయ నిర్వహకుడి డైలీ సహాయం చేస్తున్న వారి రిజిస్టర్లో దాతతో రాయిస్తున్నారా? ఒకవేళ దాత రాయక పోయినా ఆశ్రయ నిర్వాహకుడు రాయాలి. ఈ విషయం గమనించండి.
**ఇవన్నీ అనంతపురంలోని ఆశ్రయ అనాథ ఆశ్రయం,కాట్నే కాలువ గ్రామము లోని కృష్ణారెడ్డి దంపతులు పాటిస్తున్నారు- 35 సంవత్సరాల నుండి వారి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఒక తల్లి (తప్పిపోయి)
వారి ఆశ్రయంలో ఉండి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సహాయంతో బిడ్డల వద్దకు చేరింది (2018).ఆ తల్లిది అనంతపూర్ జిల్లా రాయదుర్గం.ఆమె బిడ్డలు వచ్చి ఆమెను సంతోషంగా తీసుకొని వెళ్లారు. ఇలాంటివి జరిగాయి**
*గమనిక* ఇక్కడ ఆశ్రయ నిర్వాహకులను తప్పు పట్టడం లేదు. బయటి పరిస్థితులు కూడా ఇలా ఉన్నాయి కొన్ని చోట్ల. వారు చేస్తున్న సేవలు అభినందనీయం కానీ కాలక్రమేణా మార్పులు రావచ్చు.
కొంతమంది చిన్నపిల్లలు అనాధలకు సహాయం అని మా స్కూల్ టీచర్లు పంపారు అని స్కూల్ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా డబ్బు కలెక్ట్ చేసి స్కూల్ ఇంటర్వెల్లో స్నేహితులకు ఖర్చు పెడుతున్న వారిని చూచాను.
ఇవి అన్ని నా అభిప్రాయం, అనుభవాలు. కావున దాతలు పై విషయాలలో తప్పులు పట్టకుండా గమనించగలరని నా చిన్న మనవి మాత్రమే.
@@నమస్తే@@