9 JAAGRATTA SUMAA
జాగ్రత్త సుమా! (9) బాచి
ప్రస్తుతము ప్రతి ఒక్క సగటు మనిషి మంచి విజ్ఞానాన్ని పొంది దానిని మరొకరికి అందించి తోడ్పడాలి అనేది సబబే. కానీ ప్రస్తుతము మనము ఉన్న ఈ రంగు రంగుల ప్రపంచంలో మహా మహులు,మేధావులు, అందరు ఏదో ఒక మంచి సంకల్పంతో సభలు,సమావేశాలు,చర్చావేదికలు మొదలగునవి నిర్వహించడం మంచివే.
వంద సంవత్సరములు వెనుక లేదా వెయ్యి సంవత్సరములు క్రిందట మన కవులు,పోరాటవీరులు,మేధావులు చేసిన గొప్ప కార్యక్రమములు మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటి పరిస్థితులలో కాని, ఇప్పుడు జరుగుతున్న సభలు,సమావేశాలు మొదలగునవి రక రకాలుగా ఉంటున్నాయి. ఇవి ఎలా ఉంటున్నాయి అంటే సమాజ నిర్మాణం కోసం కాని,మంచిని అభివృద్ధి చేయటానికి తోడ్పడుతున్నాయని చెప్పలేని పరిస్థితులు. ఆనాడు మనవారు చేసింది ఈనాటి సమాజం కోసం. కాని ఈనాడు కేవలం తన ఫోటో పత్రికలలో వచ్చిందా? చప్పట్లు కొట్టారా? మెచ్చుకున్నారా? మొదలగునవి స్వార్థ పూరితంగా ఉన్నాయి కాని నిస్వార్థంతో ఉన్నవి కావు. కొన్ని సందర్భాలలో వేదిక మీద వారు ఏమి
Cont...2
Page :2 (9)
ప్రసంగిస్తున్నారు అనేది కూడా మరిచి పోతున్నారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే మనల్ని మనము మోసం చేసుకుంటున్నాం. ఈరోజు ఉన్న దిన పత్రికలూ,సోషల్ మీడియా,పెరిగిన టెక్నాలజీ, రీసెర్చ్ లు,
టి.వి.,మొదలగునవి మనము చూస్తున్నాము. అందులో కూడా స్వార్థపూరితంగా,కొన్ని మార్లు మంచిగా, మరెన్నో విధాలుగా ప్రచారం జరుగుతున్న,మనం చూస్తున్న వాటిలో మంచి అనేదాన్ని నిర్ణయించుకోపోలేక పోతున్నాం.
ఇక్కడ జాగ్రత్త సుమా! అని ఎందుకు సంబోధించడం జరిగింది అంటే,
సోషల్ మీడియా ,సభలు,పత్రికలూ మొదలగు వాటిలో లేదా ఎదుటి వారు వాగ్ధాటికి మీరు (అందరం) సంబర పడిపోయి నిజా నిజాలు మరిచి పోతున్నాం. కొన్ని స్వప్రయోజనాల కోసంఉపయోగించుకొని ఎదుటి మనిషికి బాధ,ఆలోచనా శక్తిని కోల్పోవటానికి దోహదం చేయటమే కాక,సంఘ విద్రోహానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి.
కాబట్టి...
ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేద్దాం.
మరొక్క సారి అందరికి జాగ్రత్త సుమా!