12 YUVATHA (YOUTH)

యువత  (12) బాచి

*ఓ యువత! నిరుత్సాహ పడవద్దు. మీరు సాధించాలి అనుకున్నది సాధించగలరు.*

                ప్రస్తుతం యువత, వారు చదివిన చదువులకు సరియైన ఉద్యోగం రాలేదని,సాధించాలనుకున్నది సాధించలేకపోతున్నామని,మేము సాధించాలి అని అనుకున్నా మా తల్లిదండ్రులు డబ్బులు పెట్టలేరు అని నిరుత్సాహ పడిపోతూ,డిప్రెషన్కు లోనై రకరకాలుగా ఆలోచిస్తున్నారు.

                  ఓ యువత! మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మి తెలివితో,మీ చదువుతో,కంప్యూటర్ ద్వారా మీకు తెలిసిన విషయం ప్రపంచంలో అందరికి తెలిసి మీ స్వయం శక్తితో నిలబడగలగాలి అనే ఆశయం మంచిదే. కాని మీ ఆశయం నెరవేరటానికి కొంత కాలం పడుతుంది. ఆకొంత కాలం ఓర్పుతో ఉండండి. తర్వాత మీకు మీరే రాజు విజయం ద్వారా.

                  అంతేకాని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు రోజు వాడే గూగుల్ సెర్చ్ ఇంజన్ ఏమి చెపుతుందో చూడండి. ఆ సంస్థ వారి విషయాలు తెలుసుకోండి. మీలాగా ఒకలాంటి యువత వారు.
ఇక్కడ మీరు క్రింది విషయాల్ని ప్రయత్నించండి. మీరు మీ గుర్తింపు కోసం కాని,ఆదాయం కోసం కాని,సమాజంకు ఉపయోగపడే విషయం కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ,ఆదాయం కోసం మీ వెబ్సైట్ క్రియేట్ చేసి ప్రపంచం మొత్తం చూడాలి,అధిక ఆదాయం రావాలి అని అనుకోవడం పొరపాటు. దానికి కొంత సమయం పడుతుంది.

            అదే విధంగా అన్ని విషయాలలో కూడా వేచి చూడాలి. వాటి కోసం ఆగండి, చూడండి లేదా మరో ప్రయత్నాన్ని ఎన్నుకోండి. నిరుత్సాహ పడకండి. ఒకే ప్రయత్నం మీద ఆధారపడవద్దు. విజయం సాధించండి.  కొన్ని సందర్భాలలో మీరు ఇతరుల సలహాలు తీసుకోండి.

          మీరు చేస్తున్న ప్రయత్నం ఒక కరపత్రం ద్వారా మీ స్నేహితులు 10 మందికి ఇచ్చి చూడండి.

         ఆకరపత్రము (Pamphlet) ఎంతమంది చదువుతారో,దానికి ఎంతమంది స్పందిస్తారో,ఆ స్పందనకు ఎన్నిరోజులు పడతాయో తెలిస్తే,తెలుసుకో గలిగితే విజయం సాధించినట్టే.

         మీరు చేసే పనికి స్పందన రావచ్చు. విమర్శలకు ధైర్యంగా నిలబడండి. విమర్శ వినగలిగితే మరో ఆలోచన రావచ్చు. ప్రయత్నించి చూడండి.

          Google సంస్థ వారు చెపుతున్న సూక్తులు ఎంతమంది చదివి ఉంటారో తెలియదు కాని,ఒక పుస్తకంలో గూగుల్ సంస్థ వారి గురించి ప్రచురించిన చాలా రోజులకు నేను చదివాను.

          ఒక ప్రముఖ Search engine (Google) వారు చెప్పిన మాటలు మీకు నేను ఈవిధంగా తెలపడానికి చాలా రోజులు పట్టింది. మీ ద్వారా ఇతరులకు ఎప్పుడు తెలుస్తుందో చెప్పలేము.

Google సంస్థ వారు చెప్పిన జి - సూక్తులు:

(1) "నిఖార్సయిన నాయకుడు జ్ఞానాన్ని గుప్పిట్లో బంధించడు. దోసిళ్ళ కొద్దీ పంచుతారు".
( ఇది పాతకాలంలో కేవలం ఉపాధ్యాయులకు,మార్కెటింగ్ రంగం వారి,మంచి ఆలోచనతో ఇతరులు అభివృద్ధి చెందాలి అనే భావన ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇది సాధ్యం అని నా అభిప్రాయం)
(2) "నీ తెలివితేటలన్నీ నువ్వడిగే ప్రశ్నలో ఉంటాయి. నువ్వు ఇచ్చే సమాధానం కాదు".(కాబట్టి ప్రశ్నించు,తెలుసుకో)
(3) "ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండడం కంటే ఏదో నిర్ణయం తీసేసుకోవడమే ఉత్తమం - అది పొరబాటు నిర్ణయమైనా" (మంచి విషయాలలో ఒకటి కాకపోతే,మరొకటి అని అర్థం)
(4) "అందరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయంటే, కొందరు అసలు ఆలోచించడమే లేదని అర్థం.(కాబట్టి అందరూ ఆలోచించాలి)

(5) "సమాచారం,సత్యం-నిర్ణయంలో రెండు కోణాలు ముఖ్యమే. గణాంకాన్ని పూర్తిగా నమ్మలేం. సత్యానికి గణాంకాలు తోడైతే విశ్వసనీయత''
(విశ్వసనీయత ఎలా ఉంటుందో తెలుసుకోండి.)
(6) "లోపాలుంటే సరిదిద్దుకోవచ్చు. నష్టాలుంటే పూడ్చుకోవచ్చు. సమస్యలుంటే పరిష్కరించుకోవచ్చు".

కానీ చెడు మాత్రం చేయకండి. ఆ మరక శాశ్వతంగా ఉండి పోతుంది.


**ఏక వాక్య హెచ్చరిక,సలహా...**

***"DONT BE EVIL"***

గూగుల్ నైతిక దిక్సూచి కూడా ఇదే. కాబట్టి యువత నిరుత్సాహ పడకుండా నమ్మకంతో,ధైర్యంగా విజయాన్ని సాధించండి.

**నేటి యువత విజయం సాధించగలరని ఆశిస్తూ...**


**క్లుప్తంగా Google History**
**ఒక క్యాంపస్ చెట్టుక్రింద ఇద్దరు,ముగ్గురు స్నేహితులు ప్రాణం పోసిన ఒక చిన్న సంస్థ**

Google: Search engine

Started: 1998

Development: 40 Countries

Weekly:50,000 Resumes

Searching the People: Crores

CEO: లారిపేజ్, సెర్జీ బ్రిన్

First investor for Google:
Sun micro system Founder Mr.Yandi(1 Lakh Dollars invested for Google)

**Readers-Thanks to All & Best of Luck**

Popular posts from this blog

BINDU JEERA SODA JOB VACANCIES