13 MISSING
కనబడుట లేదు (13) బాచి
**ప్రియమైన వారికి,ప్రజలకు చిన్న మనవి**
ఈమధ్య కాలంలో చాలా మంది చిన్నారులు,పెద్దలు కనబడుటలేదు అని బస్టాండ్, రైల్వేస్టేషన్ లలో కనబడుటలేదు అను పోస్టర్స్ చూస్తున్నాం. ఇందుకు కారణాలు ఏవైనా కావచ్చు. అందుకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ మధ్య కాలంలో ప్రచారంలో భాగంగా అన్ని రంగాల వారు ఇంటి వద్దకు వచ్చి మీ వివరాలు అడిగి (మీ పేరు,మీ ఇంటిల్లి పాది వివరాలు,మీ ఫోన్ నంబర్లు అడిగి రాసుకొని వెళుతున్నారు. అలాగే సేవ కార్యక్రమాలు,దేవుడి పేరు చెప్పి దానం కోసం అని మీ ఇంటి కాంపౌండ్ లోకి కూడా అనుమతి లేకుండా,మీరు మొదట ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని వస్తున్నారు) వచ్చిన వారు మంచి వారు కావచ్చు,కాక పోవచ్చు.
**ఆ వచ్చిన వారితో క్రింది విధంగా అడిగి చూడండి (జాగ్రత్తలు)**
(1) మీ వద్దకు వచ్చిన వ్యక్తి ఐడెంటిటీ కార్డ్ చూపించమనండి.
(2)ప్రభుత్వ ఉద్యోగి అయితే వారి గుర్తింపు కార్డు లేదా హెల్త్ కార్డ్ చూపించమనండి. ఒక వేళ వారు వేరొక ఎంప్లాయ్ ద్వారా వచ్చినట్టయితే వారు చేస్తున్న పనికి పంపిన వ్యక్తినుండి అధికారపూర్వక లెటర్ ఉందేమో చూడండి (వారు చేసే పనికి నియమించ బడ్డారని)
(3)కారు లో ఎవరైనా క్రొత్త వ్యక్తులు దారి చూపండి అని కారు ఎక్కమంటే కారు ఎక్కవద్దు.
(4) చిన్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే తీసుకోవాలని నేర్పండి.
(5) మీ ఇంటికి వచ్చే డోర్ టు డోర్ మార్కెటింగ్కు,ఇతర మార్కెటింగ్ కు వచ్చే ప్రతి వారిని మొదట ఐడెంటిటీ కార్డ్ ఉందా అని చూపించమనండి.
(6) వచ్చినవారు మీ వివరాలను అధికార పూర్వక పుస్తకం లేదా పేపరు లో వ్రాస్తున్నారా? (లేక) జిరాక్స్ కాపీ లో రాస్తున్నారా? వాటిపై సంస్థ,ఆఫీసు పేర్లు ముద్రించినవా? లేక వారు స్వయంగా తయారు చేసినవా? అని గమనించగలరు.
Cont...2
Page :2 (13)
(7)ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి. అన్నింటికి ప్రతి పోలీస్,గవర్నమెంట్ అధికారులు కాపలా కాయడం కష్టమే. మనవంతు మన జాగ్రత్తను పాటిస్తే కొంత వరకు సమస్యను నిరోధించవచ్చు.
"మంచిని ఆచరిస్తే అది సాధ్యమే". ప్రయత్నించి చూడండి.
(8) ఎవరైనా మీ ఇంటి దగ్గర,వీధిలో అరగంట,గంట ఒకే స్థలంలో,వీధిలో అటు,ఇటు తిరుగుతున్నారంటే,ఆ వీధిలో ఎవరు గమనించినా వెంటనే మీకు ఎవరు కావాలండి? ఎవరు మీరు అని నవ్వుతూ మర్యాదగా అడిగి చూడండి. ఆవ్యక్తి ఎదిరించి జవాబు ఇస్తే వీధిలోని వారిని ఇంకో నలుగురిని పిలవండి.ఆవ్యక్తి సరైనవాడు కానప్పుడు మనము అడిగినవెంటనే ఆ మరుక్షణం చుట్టుపక్కల ఎక్కడా ఉండరు.
(9) మీ అమ్మాయి కాలేజి,ట్యూషన్ వెళుతున్న టైమింగ్స్ (పర్ఫెక్ట్ టైమింగ్స్) అవతలి వారు గమనించవచ్చు. ఏదైనా మీఅమ్మాయికి అనుమానంగా ఉన్నపుడు వెంటనే తల్లితండ్రులకు తెలపాలని చెప్పండి.
(11) సెల్ ఫోన్స్,లాప్ టాప్స్ లో వారు స్వతంత్రంగా ఉండనీయవద్దు. మన పిల్లలు మంచివారే. అటు ప్రక్క నుండి కొంతమంది పిల్లలను అట్రాక్టు చేయవచ్చు. దూరంగా పోయి,మిద్దె మీదకు పోయి,కూరగాయలకు,స్నేహితురాలుతో పోయి ఫోన్లో మాట్లాడుతుంటారు. లేదా లేటెస్టుగా ఇంట్లో లైట్లు ఆర్పి దుప్పటి కప్పుకొని,బాత్రూములలో సెల్ ఫోన్ లలో చాటింగ్,చిన్నగా మాట్లాడం చేస్తారు. ఇలా చేసే పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టండి.
**చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.**
"మన వస్తువు బంగారమే - దాన్ని కరిగించేవి ఉంటాయి సుమా"
** ఇది నా చిన్న ప్రయత్నం**
గమనిక: ఆ ఇదంతా సోది అనుకుంటే - మీకంటే గొప్పవారు లేరని అర్థం.
@@నమస్తే@@