14 OM NAMAH SIVAAYA


ఓం నమఃశివాయ  (14)
       శివ మందిరంలో ప్రవేశిస్తుండగా ప్ర ప్రథమంగా నందికి ప్రణమిల్లాలి. నంది శివుని వాహనము. అట్లే మనం శివునికి వాహనంగా ఉండగలిగితే మనకు కూడా జగత్తులో సమ్మానాలు జరుగుతాయి. దైవ కార్యానికి వినియోగపడే వృషభం కూడా పూజింప బడుతుంది. ఎద్దుకు బుద్ధి చాలా తక్కువ అని మన అభిప్రాయం. కానీ భగవంతుని లేదా భగవత్ జ్ఞానాన్ని మస్తిష్కంపై మోసుకొని మానవుడు విశ్వంలో పురోగమించ గలిగితే సామాన్య బుద్ధి కల ఎద్దు కూడ మహా మహా విద్వాంసులను కూడ ఓడించగలుగుతుంది. భగవత్ కార్యానికి వినియోగపడే వృషభం కూడా అర్చించ బడుతుంది. సరళ విషయం మనకు తెలిస్తే ఎంత బాగుంటుంది?
**నమస్తే**

Popular posts from this blog

BINDU JEERA SODA JOB VACANCIES